లింగమయ్యా.. వెళ్లొస్తం..ముగిసిన సలేశ్వరం జాతర

లింగమయ్యా.. వెళ్లొస్తం..ముగిసిన సలేశ్వరం జాతర
  • చివరి రోజున భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

అచ్చంపేట/అమ్రాబాద్, వెలుగు : ‘లింగమయ్యా వెళ్లొస్తం.. వచ్చే ఏడాది మళ్లొస్తం’ అంటూ భక్తులు సలేశ్వరం నుంచి తిరుగుబాట పట్టారు. నల్లమల అడవిలో మూడు రోజుల కింద ప్రారంభమైన సలేశ్వరం జాతర ఆదివారంతో ముగిసింది. చివరి రోజున మూడున్నర నుంచి నాలుగు లక్షల మంది భక్తులు రాగా.. మూడు రోజుల్లో మొత్తం ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది లింగమయ్యను దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో కొందరు స్వామి వారిని దర్శించుకోకుండానే వెనుదిరిగారు. భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో అడుగడుగునా ట్రాఫిక్‌‌ ఇబ్బందులు తలెత్తాయి.